భాషకి హద్దులు లేవని నిరూపించారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి, కంపోజ్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరుగాంచారు. ఇప్పుడు ఆయన కూతురు ఖతీజా రెహమాన్ కూడా సంగీత దర్శకురాలిగా మారారు. సిల్లు కారుపత్తి ఫేమ్ హలిత షమీమ్ దర్శకత్వం వహిస్తున్న మిన్మిని మూవీతో ఆమె మ్యూజిక్ కంపోజర్‌గా అరంగేట్రం చేయడానికి రెడీగా ఉన్నారు.
ఈ విషయాన్ని డైరెక్టర్ హలిత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రికార్డింగ్ స్టూడియోలో ఖతీజాతో కలిసి ఉన్న ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. మిన్మినీ మూవీలో ఎస్తేర్ అనిల్, హరి కృష్ణన్, గౌరవ్ కలై, ప్రవీణ్ కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.