Tuesday, November 26, 2024

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక పరుగులు చేసిందెవరు?

టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కీలక ఆటగాళ్లు. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో మాత్రం ఈ ఇద్దరు ఆటగాళ్లు టాప్‌లో లేకపోవడం గమనార్హం. ఓవరాల్‌గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో ఆసీస్ ఆటగాడు లబుషేన్ 1675 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ (1660) ఉన్నాడు.

టీమిండియా తరఫున ఆజింక్యా రహానె 1095 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతడు మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. డబ్ల్యూటీసీలో వెయ్యి పరుగుల మార్క్ అందుకున్న మరో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ మాత్రమే. అత‌డు 1030 ప‌రుగులు చేశాడు. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన అతడు నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 64.49 సగటు కలిగి ఉండి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక కోహ్లి కేవ‌లం 877 ప‌రుగుల‌తో త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 43.85 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. అయితే త‌న కెరీర్ బెస్ట్ స్కోరు అయిన 254 స్కోరును డ‌బ్ల్యూటీసీలోనే అత‌ను అందుకున్నాడు. 2019లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లి ఈ స్కోరు చేశాడు. ఏడాది కాలంగా సెంచ‌రీ చేయ‌లేక‌పోయిన విరాట్‌.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైన‌ల్లో ఆ క‌రువు తీర్చుకోవాల‌ని భావిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement