Wednesday, December 11, 2024

WGL | ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయ‌త్నం..?

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేయ‌డంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డాడు. ఆరో తరగతి విద్యార్థి ఈశం రుత్విక్ ను పదవ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో ఆ వేధింపులను తట్టుకోలేక ఎలర్జీ మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన గూడూరు మండలంలో చోటుచేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు హుటాహుటిన మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఆరో తరగతి విద్యార్థిని పదవ తరగతి విద్యార్థులు ఇద్దరూ ర్యాగింగ్ చేయడంతో పలుమార్లు ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి రోదిస్తూ తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement