Saturday, November 23, 2024

ఎంపీలకు లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీలకు లేఖ రాశారు. తన అరెస్ట్‌ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి పలువురు ఎంపీలు విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వానిది హిట్లర్‌ పాలనగా కాంగ్రెస్‌ ఎంపీ మానిక్కం ఠాగూర్‌ అభివర్ణించారు. రఘురామ లేఖను ట్విటర్‌లో ఠాగూర్‌ పోస్ట్‌ చేశారు. రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఎంపీలకు రాసిన లేఖలపై స్పందించడానికి రఘురామ నిరాకరించారు.

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన బుధవారం రాత్రి ఇక్కడ 9.20 గంటలకు స్పీకర్‌ను కలిశారు. దాదాపు అర్ధ గంట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. తన కేసులో సీఎం జగన్‌రెడ్డి, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, ఏఎ్‌సపీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement