Monday, November 25, 2024

Indian Olympic: భారత ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓగా రఘురాం అయ్యర్

భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఏసీ) కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యర్ ఎంపికయ్యారు. గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈఓగా పనిచేశారు. ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. క్రీడా నిర్వహణలో రఘురామ్కు విశేష అనుభవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని వెల్లడించింది.

పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘురాంను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఆయన ఎంపిక ఏకగ్రీవమని కూడా పేర్కొంది. సీఈఓ నియామకంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలుమార్లు గుర్తు చేసిన నేపథ్యంలో రఘురామ్ నియామకం జరిగింది. రాజస్థాన్ రాయల్స్కు సీఈఓగా పని చేసిన రఘురాం గతంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ సూపర్ లీగ్స్లో భాగంగా ఏటీకే మోహన్ బగన్కు, ఆర్పీఎస్జీ మేవరిక్స్ (టేబుల్ టెన్నిస్ టీం)కు సేవలందించారు. కాగా, అయ్యర్ ఎంపికను ఐఓసీ మాజీ అధ్యక్షురాలు పీటీ ఉష కూడా స్వాగతించారు. అయ్యర్‌కు స్పోర్ట్స్ రంగంపై లోతైన అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రపంచ క్రీడారంగంలో భారత్ విజయాల దిశగా అయ్యర్ ఎంపిక ఓ కీలక ముందడుగు అని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ భారత్ ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ బాధ్యతలను ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఐఓఏ జాయింట్ సెక్రెటరీ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement