వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై ఆయన కుమారుడు భరత్ స్పందించారు. అకారణంగా తమ నాన్నను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో 30 మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని తెలిపారు. నాలుగు నెలల క్రితం తమ తండ్రికి బైపాస్ జరిగిందని, ఓ ఎంపీని 30మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాన్నను ఎక్కడికి తీసుకువెళ్లారో తెలీదని, తమకు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, పోలీసుల దగ్గర వారెంట్ కూడా లేదని పేర్కొన్నారు. కాగా ఈరోజు రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు అని భరత్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement