వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఫిర్యాదుల స్వీకరణకు ఒక టోల్‌ఫ్రీ నంబరు ఏర్పా టు చేయాలని సీఎం జగన్‌కు సూచించారు. విజయసాయిరెడ్డిని సీఎం ఎందుకు అదుపులో పెట్టడం లేదని ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజుకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని, ఆయనపై సాయిరెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేశారన్నారు.
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును చెడ్డవారన్నంత మాత్రాన సాయిరెడ్డి మంచివాడు కాలేడని రఘురామ స్పష్టం చేశారు. విశాఖలో రూ.100 కోట్ల విలువైన భూమిని విజయసాయిరెడ్డి కబ్జా చేశారని తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. విశాఖలో స్థలాలు ఉండి విదేశాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 68మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేయడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనలు తెలిపారు.