Sunday, November 24, 2024

సీఐడీ కోర్టులో RRR

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారన్న అభియోగాలపై అరెస్ట్ చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో అధికారులు హాజరుపర్చారు. ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.

బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే రఘురామను జైలుకు తరలించనున్నారు.

మరోవైపు ఇప్పటికే రఘురామ బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. హైకోర్టు సూచనల మేరకు రఘురామకృష్ణరాజు దిగువ కోర్టులో సోమవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రఘురామ కస్టడీని కోరుతూ సీఐడీ అధికారులు పిటిషిన్ వేయనుండగా, ఈ రెండు పిటిషన్ల విచారణలు సమాంతరంగా జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement