సింగర్ సునీత ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. కాగా ఇప్పుడు ఈమె వారసుడు సినిమాలోకి రంగప్రవేశం చేస్తున్నాడు. సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గురువారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఈ సినిమా స్టార్ట్ కావడం విశేషం. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్‌కి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, గాయని సునీత కెమెరా స్విచాన్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం వెల్లడించింది.పీరియడ్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆకాష్ హీరోగా, నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి కెమెరామెన్ కావడం విశేషం. ఇక ఈ సినిమాని ఆర్.కె.టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. గురువారం ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచాన్ చేయగా, మ్యాంగో మీడియా అధినేత, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్‌నిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement