Wednesday, November 13, 2024

Ragging – బట్టలు విప్పించి …నగ్నంగా ఊరేగింపు

హాస్టల్​లో ర్యాగింగ్ కలకలం
వయనాడ్​ జిల్లాలో తోటి విద్యార్థుల దారుణం
వాష్​రూమ్​లో వైద్య విద్యార్థి ఆత్మహత్య
విచారణలో వెలుగులోకి విస్తుపోయే అంశాలు
నీళ్లు, తిండి పెట్టకుండా చిత్రహింసలు
చేతులు కట్టేసి బెల్టుతో దారుణంగా హింసించారు
కేరళ హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి సీబీఐ
ఘటనకు బాధ్యులైన 18 మంది విద్యార్థుల సస్పెన్షన్
మధ్యంతర నివేదిక వెల్లడించిన యాంటీ ర్యాగింగ్​ స్వ్కాడ్​

కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలో ఘోరం జరిగింది. హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థి మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్ల సిద్ధార్థన్ వెటర్నరీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అతను సూసైడ్ చేసుకునే ముందు దాదాపు 29 గంటల పాటు చిత్రహింసలు అనుభవించాడని నివేదికలో వెల్లడయ్యింది. ఆ వేధింపులు తాళలేక ఫిబ్రవరి 18న బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ర్యాగింగ్ తట్టుకోలేకే సిద్ధార్థన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు.

నీళ్లు, తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు..

ర్యాగింగ్​ పేరుతో సిద్ధార్థన్​ను చాలా చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఆహారం, నీళ్లు ఇవ్వకుండా ఆకలితో అలమటింపజేశారని, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వాపోయినట్టు సమాచారం. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తానిక ఉండలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సూసైడ్ ఘటనపై కాలేజీ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అప్రమత్తమైంది. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై మధ్యంతర నివేదిక వెల్లడించింది. సిద్ధార్ధన్ డెడ్ బాడీపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ర్యాగింగ్ సమయంలో సిద్ధార్థన్ దుస్తులు, లోదుస్తులను కూడా తొలగించి నగ్నంగా ఊరేగించి, దారుణంగా కొట్టారని తెలిపింది.

- Advertisement -

తీవ్ర మానసిక ఒత్తడితోనే..

ఫిబ్రవరి 16వ నుంచి ఫిబ్రవరి 17 వరకు సిద్ధార్థన్‌ను చేతులపై బెల్టులతో కొట్టారు. దీంతో తీవ్ర మానసి ఒత్తిడికి గురైన సిద్ధార్థన్ ఫిబ్రవరి 18న ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో 18 మందిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. నలుగురు సభ్యుల సీబీఐ బృందం వాయనాడ్ కేరళ పోలీసు అధికారులతో సమావేశమైంది. మృతుడి కుటుంబసభ్యుల నుంచి పూర్తి వివరాలు రాబట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement