Tuesday, November 26, 2024

Indian Air Fore | రాఫెల్‌ నెంబర్ 36.. భారత్‌కు చేరిన ఫ్రాన్స్‌ ఫైటర్‌

ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న రాఫెల్‌ జెట్‌ఫైటర్ల ఒప్పందం ప్రక్రియ పూర్తయింది. 36 జెట్‌ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఇదివరకే 35 యుద్ధ’విమానాలు వైమానిక దళంలో చేరాయి. చివరి జెట్‌ గురువారం ఐఏఎఫ్‌లో చేరింది. ఈ మేరకు ఐఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. రాఫెల్‌ ఫైటర్ల కొనుగోలు ఒప్పందం ముగిసిందని పేర్కొంది. వీటిని హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్‌లోని బసిమరలో మోహరించారు. మొదటి విడత రాఫెల్‌ ఫైటర్లు 2020 జులై 29న వచ్చాయి. రూ.60 వేల కోట్ల విలువైన ఈ రక్షణ ఒప్పందం 2016లో భారత్‌-ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య కుదిరింది. రాఫెల్స్‌కు అధునాతన మిస్సైళ్లను అమర్చారు. రాడార్‌ గై డైడ్‌ మెటోర్‌ మిస్సైల్‌ ఇందులో ఒకటి. గగన తలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించగల అత్యుత్తమ క్షిపణులలో ఇదొకటి.

రాఫెల్‌ యొక్క ఒక స్క్వాడ్రన్‌ పాకిస్తాన్‌తో పశ్చిమ, ఉత్తర సరి#హద్దులను పర్యవేక్షిస్తుంది. మరొక స్క్వాడ్రన్‌ తూర్పు సరిహద్దు ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది. రాఫెల్‌ ఒప్పందం పూర్తయినందున, ముఖ్యంగా చైనాతో అంతర్జాతీయ సరి#హద్దుల వద్ద ఉద్రిక్తత, ఘర్షణ చెలరేగిన సమయంలో భారత వైమానిక దళం బలం పెరిగింది. 36వ రాఫెల్‌ ఫైటర్‌ జెట్‌ త్వరలో వైమానిక దళ స్క్వాడ్రన్‌లో భాగం అవుతుంది. ఇటీవల, వైమానిక దళం రాఫెల్‌ నుండి లాంగ్‌–రేంజ్‌ మెటియోర్‌ క్షిపణి, స్కాల్ప్‌ ఎయిర్‌-టు – గ్రౌండ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. రాఫెల్‌ ఆయుధశాలకు హామర్‌ క్షిపణి కూడా జోడించబడింది. ఈ క్షిపణి తక్కువ పరిధిలో కచ్చితమైన దాడి చేయగలదని అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement