న్యూ ఢిల్లీ – దేశవ్యాప్తంగా 234 నగరాల్లో కొత్తగా ఎఫ్.ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది. అందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని ఎఫ్.ఎమ్ రేడియో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన నగరాల్లో ఎఫ్. ఎమ్ రేడియో సౌకర్యం ఉండగా.. తాజాగా మరిన్ని నగరాలలో ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు విస్తరించనున్నాయి. అందులో ఏపీలో 22 పట్టణాల్లో, తెలంగాణలో 10 పట్టణాల్లో ఎఫ్. ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది.
ఎపిలో కొత్తగా 68
ఏపీలో 68 ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అందులో.. కాకినాడలో 4 స్టేషన్లు, కర్నూల్లో 4 స్టేషన్లు, ఆదోనిలో 3, అనంతపురం 3, భీమవరం 3, చిలకలూరిపేట 3, చీరాల 3, చిత్తూరు 3, కడప 3, ధర్మవరం 3, ఏలూరు 3, గుంతకల్ 3, హిందూపూర్ 3, మచిలీపట్నం 3, మదనపల్లె 3, నంద్యాల 3, నరసరావుపేట 3, ఒంగోలు 3, ప్రొద్దుటూరు 3, శ్రీకాకుళం 3, తాడిపత్రి 3, విజయనగరం 3.. ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణలో 31…
తెలంగాణలో కూడా 31 ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు కానున్నాయి. అందులో.. ఆదిలాబాద్ 3, కరీంనగర్ 3, ఖమ్మం 3, కొత్తగూడెం 3, మహబూబ్ నగర్ 3, మంచిర్యాల 3, నల్గొండ 3, నిజామాబాద్ 4, రామగుండం 3, సూర్యాపేటలో 3.. ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.