Sunday, November 3, 2024

సరిహద్దు రక్షణకు 10 వేల కోట్లతో రాడార్లు.. ఎల్ ఏ సీ వెంబ‌డి చైనా క‌ద‌లిక‌ల‌పై ఫోక‌స్‌

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వాయుసేన కదలికలను నిశితంగా పరిశీలించేందుకు మన ఆర్మీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం దేశీయంగా అభివృద్ధి చేసిన రాడార్లను అక్కడ మోహరించాలని నిర్ణయించింది. వీటికోసం దాదాపు రూ.10 వేల కోట్లు కేటాయించింది. రాబోయే కాలంలోవీటిని వాయు సేనకు అందించనున్నారు. రూ.10 వేల కోట్ల కాంట్రాక్టులో హెచ్‌పీఆర్‌ రాడార్లతోపాటు, 20 అశ్విని రాడార్లను కూడా మేకిన్‌ ఇండియా కింద కొనుగోలు చేసే అవకాశం ఉంది. హెచ్‌పీఆర్‌ రాడార్లు 400కుపైగా కిమీ, అశ్వినీ రాడార్లు 150 కి.మీ. దూరంలోని వాటిపై నిఘా పెట్టగలవు.

సరిహద్దుల్లోని రాజస్థాన్‌, పంజాబ్‌, గుజరాత్‌ ప్రాంతాల్లో రాడార్ల సాయంతో కదలికలను గుర్తించడం కొంతవరకు సులభమే.కానీ జమ్ము కాశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ వరకు రాడార్లను ఉపయోగించడం ఒక రకంగా సవాల్‌తో కూడుకున్నదే. ముఖ్యంగా పర్వతాలు, ప్రతికూల వాతావరణాలు అడ్డంకిగా మారుతుంటాయి. చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు కూడా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సీలా టన్నెల్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి సిద్ధం కానుంది. దీంతోతవాంగ్‌ ప్రాంతానికి అన్ని వేళల్లో కనెక్టివిటీ లభిస్తుంది. 12 సొరంగ మార్గాలకు కూడా నివేదికలు సిద్ధమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement