Friday, November 22, 2024

వెలమవీరుల గుర్తుగా రాచకొండ ఎత్తిపోతల పథకం.. సిద్ధమైన డిపిఆర్‌, 279 చెరువుల్లోకి పారనున్న నీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆరుదశాబ్దాల వివక్షకు గురైన తెలంగాణ ఇప్పుడు దేశానికి తలమానికమైంది. పల్లమెరిగిన నీటినిఒడిసి పట్టి పైనున్న బీడు భూములకు నీరందిస్తూ తెలంగాణ చరిత్రను తిరగరాస్తున్నారు. తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వనన్న ఉమ్మడి రాష్ట్రం కడపటి ముఖ్యమంత్రి నిష్టూరాలతో కలత చెందిన తెలంగాణ సమాజం సంవృద్ధితో స్వర్ణయుగాన్ని తలపిస్తూంది. తెలంగాణ జలసిరుల్లో మరో జలాశయం చేరనుంది.కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఆ సామ్రాజ్య లోని వెలమవీరులు పించిన రాచకొండ కు రాష్ట్ర ప్రభుత్వం చిరస్మరణీయ గుర్తింపుగా ‘రాచకొండలిఫ్ట్‌ ఇరిగేషన్‌ ‘ నిర్మాణాన్ని తలపెట్టింది. ఈ మేరకు డిపిఆర్‌ రూపొందించింది. కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం క్రీ.శ. 1361 లో రేచర్ల పద్మనాయకులు రాజధానిగా చేసుకుని రాచకొండను పాలించారు. క్రీ. శ. 1475-1503 మధ్యలో రాచకొండ బహమనీసుల్తానుల స్థానికంగా పాలనకు కేంద్రమైంది. ఆయితే కాకతీయుల పాలనలో బాధ్యతలునిర్వహించిన రేచర్ల పద్మనాయకులు కాకతీయుల చెరువులనిర్మాణాలను కొనసాగించి రాచకొండ రాజ్యాన్ని సస్యశ్యామలంచేశారు.

సాగునీటి రంగంలో ప్రారంభమై స్వర్ణయుగం తెలంగాణ భూములకు పట్టిన పడావు చీడను వదిలించింది. కాళేశ్వరం నిర్మాణం చరిత్రసృష్టిస్తే వేలాది చెరువుల పూడిక, జలాశయాల సామర్థ్యం పెంపుతో తెలంగాణ నీటి బ్యాంక్‌ గా వర్థిల్లుతుంది. సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల్లో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఏడాదిపొడువునా పంటలకు నీరందించేందుకు డిండి ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా రాచకొండ ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్‌ తుది దశకుచేరుకుంది. టెండర్ల ప్రక్రియకొనసాగుతుంది. ప్రస్తుత వేసవికాలంలో పనులు ప్రారంభించి సంవత్సరంలోగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏపీ అభ్యంతారాలు గుదిబండ మారాయి.

సాధ్య అసాధ్యాల పై సర్వేల నిర్వహణకు 2018మార్చి20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి డిపిఆర్‌ ను ఇంజనీరింగ్‌ స్టాప్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా తో ప్రభుత్వం రూపొందింపచేసింది. సమగ్ర నివేదికను రూపొందించి భూసేకరణ తదితరపనులను పూర్తి చేసుకుని నిర్మాణ దశలోకి ఈ ప్రాజెక్టు అడుగులు వేసినప్పటికీ డిండీ రిజర్వాయర్‌ పై ఏపీ అభ్యంతరాలు తెలపడంతో పనుల్లో వేగం తగ్గింది.
ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లితే శివన్నగూడెం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి అప్రోచ్‌ ఛానాల్‌ ద్వారా రాచకొండ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ రూపకల్పనచేసింది. 1.157 క్యసెక్కుల నీటిని మూడులిఫ్ట్‌ ల ద్వరా 378 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేందుకు రూపకల్పనచేశారు. ఇందులో భాగంగా మర్రిగూడ మండలం ఖుదాబక్ష్‌ పల్లి దగంగర పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికను రూపొందించింది. 40 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటర్ల ద్వారా 2.5 డయామీటర్ల వ్యాసార్థ్‌ం తో రెండువైల నీటిని ఎత్తిపోస్తారు.

- Advertisement -

381ఎఫ్‌ ఆర్‌ల్‌ నుంచి 8.3 కిలోమీటర్లు పారేనీటిని 592 ఎఫ్‌ ఆర్‌ల్‌ దగ్గర 1.5 టిఎం సీల సామర్థ్యంతో వాయిళ్ల పల్లి దగ్గర నిర్మించే రిజర్వాయర్‌ లోకి మళ్లిస్తారు. ఇక్కడమరో లిఫ్ట్‌ ను ఏర్పాటుచేసి 22మెగావాట్ల నీటిని పంపింగ్‌ చేసి డిలవరీ సిస్టమ్‌లోకి మళ్లిస్తారు. 2డయామీటర్ల వ్యాసార్థం గల రెండు పైపుల ద్వారా 1,075 కిలో మీటర్ల మేర పారేనీటిని 684 ఎఫ్‌ఆర్‌ఎల్‌ (ఫుల్‌ రిజర్వాయర్‌ లేవల్‌) ఎత్తిపోస్తారు. ఈ నీటితో ఈ ప్రాంతంలోని చెరువులు, చిన్ననీటి జలాశయాలు ఈనీటిని నింపుతారు. అనంతరం మిగిలిన 776.93 కూ్యక్కుల నీటిని 70 మీటర్ల ఎత్తులో ఉన్న మాచర్లకు ఎత్తిపోస్తారు. అనంతరం మిగిలిన 284క్యూసెక్కుల నీటిని రంగారెడ్డి, మహాశ్వరం అసెంబ్లిd ప్రాంతాల్లోని చెరువులు నిపండం రాచకొండ ఎత్తిపోతల పథకం లక్ష్యం. అలాగే రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌మేడ్చల్‌, మల్కాజిగిరి లోని 279 చెరువుల పునరుజ్జీవనానికి నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు సంకల్పంలో భాగం.

Advertisement

తాజా వార్తలు

Advertisement