Home ముఖ్యాంశాలు Delhi | రాజ్యసభ ఎంపీగా ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవం..

Delhi | రాజ్యసభ ఎంపీగా ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవం..

0
Delhi | రాజ్యసభ ఎంపీగా ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవం..

రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవం అయ్యారు. ఈ మేర‌కు శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రాన్ని స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీసీలకు అందుతున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశం మొత్తం అందేలాగా ప్ర‌ధాని మోడీతో చర్చించి రూట్ మ్యాప్ ఖరారు చేసామని స్పష్టం చేశారు.

కాగా, రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రాన్ని తీసుకున్న సమయంలో ఆర్.కృష్ణయ్య వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ యువజన అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ తదితరులున్నారు. అనంతరం కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు.

Exit mobile version