తిరుమల, ప్రభన్యూస్ : సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటాను సోమవారం సాయంత్రం 4గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కాగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలం కార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపది కన భక్తులు నేరుగా బుక్ చేసుకో వచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన టికెట్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్ చేసుకునేందుకు రేపు ఉదయం 10 గంటల నుంచి 29 వ తేది ఉదయం 11 గంటల వరకు గృహస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో గృహస్తులకు టికెట్ల కేటాయింపు జరుగుతుంది. టికెట్లు పొందిన జాబితాను జూన్ 29 వ తేది మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అదేవిధంగా గృహస్టులకు ఎస్‌ఎమ్‌ఎస్, ఇ మెయిల్ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన గృహస్తులు రెండు రోజుల్లోపు టికెట్ల ధర చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.