Tuesday, November 26, 2024

కార్పొరేట్‌లో కొత్త ట్రెండ్‌ క్వైట్‌ హైరింగ్‌.. ఉన్న వారితోనే సర్ధుబాటు

కరోనాతో కార్పొరేట్‌ రంగంలో అనేక కొత్త విధానాలు అమల్లోకి వచ్చాయి. ఇందులో ఒకటి మూన్‌లైటింగ్‌. టెక్‌ కంపెనీల్లో ఇదిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఐటీ కంపెనీల మధ్య దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్రేట్‌ రెసిగ్నేషన్‌, క్వైట్‌ క్విట్టింగ్‌, రేజ్‌ అప్లయింగ్‌ వంటి విధానాలు వచ్చాయి. తాజాగా క్వైట్‌ హైరింగ్‌ అనే కొత్త ట్రెండ్‌ వెలుగులోకి వచ్చింది. గ్రేట్‌ రెసిగ్నేషన్‌ మన దేశం కంటే అమెరికాలో పెద్ద ఎత్తున సాగింది. ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. ఇలా ఉద్యోగుల తొలగింపుతో ఐటీ కంపెనీల్లో కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించేందుకు వచ్చిందే క్వైట్‌ హైరింగ్‌ విధానం. కొత్త ఉద్యోగులను నియమించుకోకుండానే, ఉన్న వారితోనే కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారికి కనిపెట్టి అవసరం ఉన్న చోట ఉపయోగించుకోవడమే క్వైట్‌ హైరింగ్‌ విధానం. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్‌.

- Advertisement -

పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడంతో చాలా సంస్థల్లో నిపుణుల కొరత ఏర్పడింది. టార్గెట్‌లు అందుకోవడానికి గడువు సమీపిస్తున్న సమయంలో క్వైట్‌ హైరింగ్‌ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని టెక్నికల్‌ కన్సల్టింగ్‌ రీసెర్చ్‌ కంపెనీ గార్డ్‌నర్‌ అభిప్రాయపడింది. సంస్థలో ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు కొత్త విధులు అప్పగించడం ద్వారా కొరతను అధిగమిస్తున్నాయి. అవసరాన్ని బట్టి ఇలాంటి ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. చాలా కంపెనీలు ఈ విధానంలో అప్పటికే ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు అవసరమైన చోట ఉపయోగించుకుంటున్నారు. అంతగా డిమాండ్‌ లేని చోట ఉద్యోగులకు కంపెనీలు తగ్గించుకుంటున్నాయి.

కంపెనీలో టార్గెట్లను అనుకున్న సమయానికి చేరుకునేందుకు డేటా సైంటిస్ట్‌లు అదనంగా అవసరం ఉందనుకుంటే, ఇలాంటి సమయంలో కొత్త వారిని నియమించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దాని బదులు మానవ వనరులు, మార్కెటింగ్‌ విభాగాల్లో పని చేస్తున్న డేటా అనలిస్టులకు కొద్ది పాటి శిక్షణ ఇచ్చి ఇలాంటి చోట ఉపయోగించుకుంటున్నారు.
ఈ కొత్త విధానం ఉద్యోగులకు కూడా కొంతమెర ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. సవాళ్లతో కూడిన పనిలో తమ ప్రతిభను నిరూపించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. దీంతో పాటు ఇలాంటి పని చేసినందుకు బోనస్‌లు, అదనపు వేతనం వంటి ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు. చాలా కంపెనీలకు ఈ కొత్త ట్రెండ్‌ క్వైట్‌ హౖౖెరింగ్‌ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement