Tuesday, November 26, 2024

ఆస్క్ కేటీఆర్… ఆన్సర్ ఏదంటూ నిలదీసిన నెటిజన్స్

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా కొందరి సమస్యలను పరిష్కారిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్‌లో గట్టి షాక్ ఇచ్చారు నెటిజన్లు. ఆస్క్ కేటీఆర్ అంటూ ట్విట్ట‌ర్‌లో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో ఆయ‌న తీరును విమర్శలు గుప్పించారు. ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని తానే కోరి.. తీరా తాము అడిగిన‌ వాటికి స‌మాధానం ఎందుకు చెప్ప‌డం లేదంటూ కేటీఆర్‌పై అసహ‌నం వ్యక్తం చేశారు.

ఆదివారం ఆస్క్ కేటీఆర్‘ #AskKTR పేరుతో రాత్రి ట్విట్టర్ సంభాషణ కార్యక్రమం నిర్వహించారు. నెటిజన్లు మంత్రిపై అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెటిజన్స్ వందలాది ప్రశ్నలు వేశారు. అయితే కేటీఆర్ మాత్రం కొన్నింటికే సమాధానం చెప్పారు. కరోనా పరిస్థితుల్లో అంతా కరోనాకు సంబంధించినే ప్రశ్నలే ఎక్కువగా వేశారు. అయితే, కొందరు మాత్రం ఉద్యోగ నోఫికేషన్లపై ప్రశ్నలు సంధించారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరగా జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 50 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ గురించి కొందరు ఆయనను అడిగారు.   అయితే ఆ ట్వీట్‌కు మంత్రి బదులివ్వకుండా మౌనంగానే ఉండిపోయారు. ‘ఎన్నికలప్పుడు రాత్రికి రాత్రే డబ్బులు పంపిణీ చేస్తారు. ఆ విధంగా వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు‘ అంటూ మరో నెటిజన్ పశ్నించారు.

మరో నెటిజన్ కేటీఆర్ సార్ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా ? తీసుకుంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు ? అంటూ ప్రశ్నించారు. ఇక, ప్రభుత్వం పంపిణీ చేస్తామన్న వాగ్దానంపై నెటిజన్లు నిలదీశారు. 25 కిలోల బియ్యం తమకు అందడం లేదని ఫిర్యాదులతో చాలా మంది ముందుకు వచ్చారు. నాలాల వ్యవస్థపై కూడా మంత్రి కేటీఆర్ ను నిలదీశారు. ఇటీవల బోయిన్ పల్లిలో ఆనంద్ సాయి అనే బాలుడు నాలాలో పడి చనిపోయాడని, ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఎందుకు నిరోధించలేకపోయిందని ఓ నెటిజన్ అడిగాడు. పీహెచ్‌సీలలో కరోనా టెస్టులు చేసే పద్ధతి మార్చాలని, ల్యాబ్ టెక్సీషియన్ల సంఖ్యను పెంచాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో 24 గంటలు సర్వీసులు అందించాలని, ప్రజలను కాపాడండి. లేదంటే రాజీనామా చేయండి అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. అయితే ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో అనేక మంది నెటిజన్స్ విమర్శలు, ఆరోపణలు చేయడంతో మంత్రి కేటీఆర్ షాక్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement