Thursday, November 21, 2024

రేపే క్వాలిఫైర్ మ్యాచ్.. గురు, శిష్యుల మధ్య‌ పోటీ, ఫైన‌ల్‌కి చేరేదెవ్వ‌రు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ చివ‌రి దశకు చేరుకుంది. దాదాపు ఏడు వారాల పాటు జరిగిన లీగ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్.. ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఇక ప్లే ఆఫ్స్ లో భాగంగా జరిగే క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ తో తలపడనుంది. ఈ క్రమంలో చెపాక్ వేదికగా రేపు (మంగళవారం) జరిగే క్వాలిఫయర్ 1 పోటీకి సర్వం సిద్ధం అయ్యింది.

అయితే.. బలాబలాల విషయంలో చెన్నై కంటే కూడా గుజరాత్ జ‌ట్టు బలంగా క‌నిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఆల్‌రౌండ్ ప్ర‌తిభ చూపుతోంది. బ్యాటింగ్ లో ఒకరు విఫలమైనా మరొకరు ఆడుతూ స్కోరును పెంచుతున్నారు. ఇక బౌలింగ్ లో మ‌హమ్మద్ ష‌మీ, రషీద్ ఖాన్ అద్భుతాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్నారు.

- Advertisement -

ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో ఓపెనర్లు కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే మాత్రమే బాగా ఆడుతున్నారు. మొదట్లో మెరుపులు మెరిపించిన అజింక్యా రహానే తర్వాత చల్లబడ్డాడు. మొయిన్ అలీ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. బెంచ్ కే పరిమితం అయిన బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ లో ఆడేది అనుమానమే. నాకౌట్స్ కింగ్ గా పేరున్న స్టోక్స్ తుది జట్టులోకి వస్తే అది చెన్నై సూపర్ కింగ్స్ కు సానుకూల అంశం. చెపాక్ లో ఆడుతుండటంతో చెన్నైకి కలిసి వచ్చే చాన్స్ ఉంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరగ్గా మూడింటిలోనూ గుజరాత్ విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement