ఉదయపూర్ – ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ప్రారంభమయ్యాయి. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని ఆమె ఈరోజు రాఫెల్స్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు.
సింధు, దత్త సాయి, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉదయపూర్‌కు చేరుకున్నారు.ఈ వివాహానికి కేవలం 140 మంది అతిథులు మాత్రమే హాజరవుతారు.. వేడుకల్లో భాగంగా శనివారం మెహందీ, సంగీత్ వేడుకను నిర్వహించారు, దీనికి ముందు జంటతో కూడిన ఫోటోషూట్ జరిగింది.
ఈ వేడుకకు క్రీడా, రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో 24న రిసెప్షన్ ఏర్పాటు చేసారు.