భారత స్టార్ షట్లర్ P. V. సింధు మోకాలి గాయం కారణంగా ఇవ్వాల (గురువారం) రెన్నెస్‌లో జరిగిన BWF వరల్డ్ టూర్ సూపర్ 750, ఫ్రెంచ్ ఓపెన్‌లో తన రౌండ్ 16 గేమ్ మధ్యలో రిటైర్ అయ్యింది. సింధు 21-18తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కతేథాంగ్‌పై ఓపెనింగ్ గేమ్‌ను కైవసం చేసుకుంది. అయితే, రెండవ గేమ్‌లో 1-1 వద్ద, మోకాలికి గాయం అయ్యింది, వైద్య చికిత్స అవసరమైంది. దీంతో ఆమె మ్యాచ్‌ని కొనసాగించకూడదని నిర్ణయించుకుంది.
కాగా, ఆటను మధ్యలో విడిచిపెట్టినందుకు సింధు తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ‘‘నేను గేమ్ ని అంత తేలికగా వదులుకోను. అలాంటి పరిస్థితి తలెత్తితే.. నాకు ఆడటానికి ఇబ్బందిగా అనిపించేంతవరకు నేను ఎప్పుడూ ఆడటానికి ప్రయత్నిస్తాను. ఈ గేమ్ లో మొదటి సెట్ మధ్య నుంచే నా మోకాలికి సరిగ్గా అనిపించలేదు. అప్పటికే మెడికల్ టైమ్‌అవుట్‌లను ఉపయోగిస్తూ.. ఎక్కువగా ఫిర్యాదు చేయకుండా ఆటను కొనసాగించే ప్రయత్నం చేశాను. కాని నా మోకాలి నొప్పి ఎక్కువ అవడంతో ఆటను మధ్యలో వదిలేయాల్సి వచ్చింది’’. అని సింధూ పేర్కొంది.