భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన పెళ్లిపై జరుగుతున్న చర్చలపై స్పందించింది. తనకు అసలు పెళ్లి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఇప్పట్లో పెళ్లి ప్రసక్తే లేదని, ఆటపైనే తన దృష్టి అని వెల్లడించింది. ఒకవేళ తన పెళ్లి కుదిరితే అందరికీ చెప్పే చేసుకుంటానని వివరించింది. గత ఏడాది ఒలింపిక్స్ వాయిదా పడ్డాక తీవ్ర నిరాశ కలిగిందని, ఎంతో సాధన చేశాక, కొన్ని నెలల ముందు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని సింధు పేర్కొంది. కొవిడ్ వచ్చి పరిస్థితులను తారుమారు చేసిందని పీవీ సింధు తెలిపింది.
పీవీ సింధు ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతోంది. జపాన్ రాజధానిలో జరిగే ఒలింపిక్స్ లో సింధు పతకం తెస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్ యవనికపై ఘనమైన విజయాలు సాధించిన పీవీ సింధు పెళ్లెప్పుడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకోవడం సాధారణ విషయంగా మారింది.
ఇది కూడా చదవండి: ఇషాంత్ స్థానంలో సిరాజ్