టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్ల పీవీ సింధు దూకుడు కొనసాగుతోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధు.. భారీ అంచనాల నడుమ టోర్నీలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇజ్రాయెల్‌కి చెందిన సెనియా పోలికర్పోవాపై వరుస సెట్లలో విజయం సాధించిన పీవీ సింధు.. అదే జోరులో బుధవారం హాంకాంగ్ షట్లర్ చెంగ్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్‌లో అడుగుపెట్టింది సింధు. హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గన్ యితో తలపడిన ఆమె.. 21-9, 21-16 తేడాతో వరుస గేమ్స్‌లో గెలిపొందారు.. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం పీవీ సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పలేదు.. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో మెల్లగా పుంజుకున్న సింధు.. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. విజయానికి చేరువైంది.. ఈ విజయంతో గ్రూప్ జే టాపర్‌గా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది పీవీ సింధు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది సింధు.
ఇది కూడా చదవండి: కర్ణాటక కొత్త సీఎంగా బొమ్మై ప్రమాణం