టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో పి.వి సింధు సెమీస్ లో కి అడుగుపెట్టింది సాధించింది. దీంతో పతకానికి మరో అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలోని క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది సింధు. దాంతో మరోసారి భారత్‌కు పతకం ఖాయం చేసేలా కనిపిస్తోంది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. రెండో గేమ్ తొలి విరామానికి సింధు 11-6తో ఆధిపత్యం సాధించింది. అయితే విరామం తర్వాత యమగుచి గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో ఇద్దరి పాయింట్లు సమానంగా నిలిచాయి. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గింది . దీంతో వరుస గేమ్‌లలో గెలిచిన సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. కాగా 2016 లో సింధూ సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
ఇది కూడా చదవండి : జడ్జి హత్య కేసు..సుమోటో విచారణకు సుప్రీం స్వీకరణ..