దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం రంగమార్తాడ.కొంతకాలం క్రితం మరాఠీలో వచ్చిన ‘నట సామ్రాట్’ సినిమాకి ఇది రీమేక్. ఒక రంగస్థల కళాకారుడి జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రం నుండి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం .. రెండూ ఒకటే నాణానికి .. బొమ్మాబొరుసంతే..’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించారు. ఇళయరాజా స్వరపరచడమే కాకుండా, స్వయంగా ఆలపించారు. ఒక పాత్ర ముగిసింది నేడు .. ఇంకెన్ని మిగిలాయో చూడు, నడిపేది పైనున్న వాడు .. నటుడేగా నరుడన్నవాడు’ వంటి లైన్స్ ఈ పాటకి హైలైట్. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement