Tuesday, November 26, 2024

పువ్వాడ పుట్టిన‌రోజు.. మొక్క‌లు నాటిన మంత్రి..

ఖమ్మం : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజ‌య‌వంతంగా కొనసాగుతోంది. వేడుక ఏదైనా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనవాయితీగా మారింది. బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో మంత్రి పువ్వాడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పుట్టిన రోజు నాడు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణకు హరితహరం కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని మంత్రి పువ్వాడ చెప్పారు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు. అదేవిధంగా తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేయాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని చెప్పిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement