ఖమ్మం – కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటే, ఇటు వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు మరింత భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.నిత్యావసరం అయిన వంట గ్యాస్ పై మళ్ళీ రూ.50 పెంచి సామాన్యుల నడ్డి వీరిచే కార్యక్రమాన్ని NDA ప్రభుత్వం చేపట్టిందని, ఇది సరైన చర్యకాదన్నారు.NDA ప్రభుత్వం ఏర్పడిన నాడు రూ.460 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1160 కి తీసుకొచ్చారని, మార్చ్ 8వ తేదిన మహిళా దినోత్సవం ఉందని వారందరికీ బహుమతిగా మోడీ ప్రభుత్వం వారి నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టారని ద్వజమెత్తారు.
దేశంలో ఉన్న అన్ని కట్టేల పొయ్యి ఉన్న స్థానంలో గ్యాస్ సిలిండర్ లు ఇస్తాం అని చెప్పిన మోడీ అందరికీ ఇచ్చినట్టే ఇచ్చి దాని ధరలను మూడు ఇంతలుగా పెంచి మహిళల కళ్ళలో కారం కొట్టి కన్నీళ్లు తెప్పిస్తున్నారని ద్వజమెత్తారు. గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశప్రజలకు గుండె దడ వస్తోందని, ప్రధానమంత్రి మోడీ ఆస్తవ్యస్త ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట పుట్టిందని, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డ్ సృష్టించిందని విమర్శించారు