Saturday, November 23, 2024

సుదీర్ఘ యుద్ధానికి పుతిన్‌ వ్యూహం..

ఉక్రెయిన్‌పై సుదీర్ఘ యుద్ధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే… ప్రపంచంపై దీర్ఘకాలం పాటు యుద్ధం ప్రభావం ఉండవచ్చు. రష్యా సుదీర్ఘ యుద్ధానికి చేస్తున్న ఏర్పాట్లను అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. రానున్న ఒకటి రెండు నెలల్లో జరుగనున్న యుద్ధం పుతిన్‌కు కీలకం. ఒక వేళ రష్యా డాన్‌బాస్‌ ప్రాంతాన్ని విజయవంతంగా ఆక్రమించుకున్నా… యుద్ధం ఆగదు. అయితే, ఈ యుద్ధంలో పుతిన్‌ అణ్వాయుధాలు వాడకపోవచ్చు. సంప్రదాయ ఆయుధాల వెలతి ఉన్నట్లు పుతిన్‌ గుర్తించారు. దీంతో పుతిన్‌ కొత్త ఆలోచనలకు, కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నించవచ్చు. ఏమైనా రష్యా వ్యూహాత్మక ఆయుధాలను ఇక్కడ వాడకపోవచ్చునని యుద్ధరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఉక్రెయిన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఖెర్సాన్‌ నగరాన్ని రష్యాలో విలీనం చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కాగా… ఉక్రెయిన్‌ ఈశాన్య ప్రాంతంలోని ఖర్కివ్‌ నుంచి రష్యా సేనలను వెనక్కి తరమడంలో కొంతత విజయం సాధించినట్లు ఉక్రెయిన్‌లు చెప్పుకుంటున్నారు.

యుద్ధం ప్రారంభమైననాటి నుంచి రష్యా ఈ ప్రాంతంపై భారీ స్థాయిలో బాంబు వర్షం కురిపిస్తుది. ఈ యుద్ధంలోఇప్పటివరకు వేలాది మరణించారు. అయితే, కచ్చితమైన లెక్కలు తేలడం లేదు. బుధవారం నాడు స్లోవియాన్‌స్క్‌ ప్రాంతంపై రష్యా క్షిపణి దాడులు చేసింది. స్లోవియాన్‌స్క్‌ మేయర్‌ వాడిమ్‌ లియాఖ్‌ కథనం ప్రకారం ఈ ప్రాంతంలోని రెండు జిల్లాలపై రష్యా క్షిపణులు దాడి చేశాయి. అయితే, ఈ దాడిలో ఎవరైనా మరణించిందీ లేనిదీ ఇంకా తెలియలేదు. అజవస్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై బుధవారం కూడా రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఈ ప్లాంట్‌ ఇంకా వందమందికిపైగా పౌరులు తలదాచుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. కాగా… రష్యా గ్యాస్‌ పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ సరఫరాను విజయవంతంగా ఆపివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. యుద్ధంలో సాధించిన మరో విజయంగా దీనిని అభివర్ణించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement