రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ తన పుట్టినరోజును ఎలాంటి ఆడంబరం, హంగామా లేకుండా సాదాసీదాగా జరుపుకున్నారు. ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు, ఆ దేశంపై సైనిక చర్యపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పుతిన్ కు ఉత్సాహం కలిగించేలా బెలారస్ అధ్యక్షుడు, సన్నిహిత మిత్రుడు అలెగ్జాండర్ లుకాషెంకో పుట్టినరోజు బహుమతిగా ట్రాక్టర్‌ను అందించారు. ట్రాక్టర్‌తో పాటు, పుతిన్‌కు మిత్రదేశాలు, స్నేహపూర్వక రాష్ట్రాల అధినేతల నుండి విలాసవంతమైన బహుమతులు లభించాయి. తజకిస్థాన్ ప్రెసిడెంట్ ఎమోమాలి రెహ్మాన్.. పుతిన్ కు పుచ్చకాయల పిరమిడ్ ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన పుతిన్‌పై పశ్చిమ దేశాలు ఆగ్రహంతో ఉన్నా.. ఆయన బర్త్‌డే సందర్భంగా మాత్రం సోవియేట్ నేతలు ప్రశంసలు కురిపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement