రెండో ప్రపంచయుద్ధంలో విజయానికి సంకేతంగా ఏటా మే 9న రష్యా విజయోత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షల నడుమ ఈసారి తన ఆయుధ సంపత్తిని, సైనిక పాటవాన్ని ప్రదర్శించేలా విజయోత్సవాలు నిర్వహించేందుకు రష్యా సిద్ధమైంది. మాస్కోలోని రెడ్‌స్కేర్ బల ప్రదర్శనకు రిహార్సల్స్ చేస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా సోమవారంనాడు యుద్ధట్యాంకులు, బాలిస్టిక్ క్షిపణులుసహా ఆయుధ సంపత్తిని చాటేలా పరేడ్ నిర్వహించనున్నారు. సైనిక బలగాలు కవాతు చేస్తాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు పుతిన్ హాజరవుతారు. ఈ సందర్బంగానే ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా రెండో ప్రపంచ యుద్ధంలో సంకీర్ణ పక్షాలకు జర్మనీ లొంగిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని జి-7 దేశాలు ఆదివారంనాడు వర్చువల్‌గా భేటీ కానున్నాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఆహానం పంపారు. ఉక్రెయిన్‌కు మరో 1.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
రష్యా యుద్ధం విరమించాలి – టెడ్రోస్..
ఉక్రెయిన్ సమాజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని, తక్షణం రష్యా కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రకచించారు. శనివారంనాడు మీడియాను ఉద్దేశించి లైవ్‌లో మాట్లాడిన ఆయన యుద్ధం ఆపాలని రష్యాను నిరంతరం కోరుతూనే ఉంటామని స్పష్టంచేశారు. సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధం ప్రారంభించిన తరువాత ఉక్రెయిన్‌లోని వైద్య, ఆరోగ్య వ్యవస్థలపై 200 చోట్ల దాడులకు పాల్పడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో గాయపడినవారికి వైద్యచికిత్సలు అందించడంలోను, ధంసమైన ఆస్పత్రుల నిర్మాణంలోను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉక్రెయిన్‌కు అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ఆరోగ్య వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మానుకోవాలని రష్యాకు హితవు చెప్పారు. కాగా ఇప్పటివరకు 15000 శస్త్రచికిత్సలకు సరిపడా ఔషధాలు, పరికరాలు, 6.5 లక్షల మందికి సరిపోయేలా హెల్త్ కేర్ సామగ్రిని డబ్ల్యూహెచ్‌ఓ అందించిందన్న ఆయన ఆదివారంనాడు 20 అంబులెన్స్‌లను, దెబ్బతిన్న ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరాకు వీలుగా 15 డీజిల్ జనరేటర్లను ఇవబోతున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..