ఉదరకోశ కేన్సర్‌తో సతమతమవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తరలో ఆపరేషన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు నాడీసంబంధిత వ్యాధితోనూ ఆయన బాధపడుతున్నారు. అయితే కేన్సర్ రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతూండటంతో తక్షణం శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అందుకు సిద్ధమైనప్పటికీ అధ్యక్ష బాధ్యతలను వేరేవారికి అప్పగించేందుకు పుతిన్ సుముఖంగా లేరు. అనివార్య పరిస్థితుల్లో, కరడుగట్టిన జాతీయవాది, పుతిన్‌కు అత్యంత నమ్మకస్తుడైన 70 ఏళ్ల కేజీబీ మాజీ చీఫ్ నికొలాయ్ పత్రుషెవ్‌కు కొద్దిరోజుల పాటు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పుతిన్ భావిస్తున్నట్లు క్రెవ్లిున్‌లోని కీలక వ్యక్తులు వెల్లడించినట్లు ప్రఖ్యాత టెలిగ్రామ్ ఛానల్ జనరల్ ఎస్‌వీర్ పేర్కొంది. రష్యా భద్రతామండలిలో సెక్రటరీగా సేవలందించిన నికొలాయ్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యూహకర్త. పుతిన్‌ను యుద్ధానికి దిగేలా ప్రభావితం చేసిన నికోలాయ్ ఇప్పటికీ యుద్ధవ్యూహాన్ని అమలు చేస్తున్న వ్యక్తిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. 18 నెలల క్రితం పుతిన్‌కు కేన్సర్ సోకిన విషయాన్ని గుర్తించి వైద్యం అందిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కన్పించకపోవడంతో ఇప్పుడు శస్త్రచికిత్స అనివార్యమైంది. ఆపరేషన్ జరిగిన తరువాత పుతిన్ స్పృహలోకి వచ్చి ప్రభుత కార్యకలాపాలను నిర్వహించడానికి లేదా కనీసం సూచించగలిగే స్థితికి చేరడానికి నాలుగైదు రోజులైనా పడుతుంది.
అంతవరకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్నదానిపై పుతిన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. రష్యా చట్టాల ప్రకారం దేశాధ్యక్షుడు క్రియాశీలకంగా లేనపుడు ఆ బాధ్యతలు ప్రధానికి అప్పగించే ప్రక్రియ చాలా జాప్యంతో కూడుకుని ఉంటుంది. అంతవరకు తాత్కాలికంగా ఎవరికైనా బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా నికొలాయ్‌వైపు పుతిన్ మొగ్గుచూపినట్లు క్రెవ్లిున్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేవలం తాత్కాలిక బాధ్యతే తప్ప అధికారాల అప్పగింతకు పుతిన్ ఏమాత్రం ఇష్టపడలేదని ఆ వర్గాలు స్పష్టం చేసినట్లు జీవీఆర్ కథనం. ఏప్రిల్ రెండోవారంలోనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలవల్ల జాప్యమవుతూ వచ్చింది. మే 9లోగా నిర్వహించే అవకాశాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..