ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రత్యక్ష చర్చలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగాలేరని మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో పాల్గొన్న టర్కీ సీనియర్ అధికారి తెలిపారు. ముఖాముఖి చర్చకు జెలెన్‌స్కీ శనివారం పిలుపునిచ్చారు. అయితే, ఇందుకు పుతిన్ తిరస్కరించారని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ముఖ్య సలహాదారు ఇబ్రహీం కలిన్ చెప్పారు. కాగా భవిష్యత్‌లో రష్యాతో జరిగే ఒప్పందానికి హామీదారుగా ఉండాలని ఐరాస భద్రతామండలి శాశ్వత సభ్యులు, జర్మనీ దేశాన్ని కొద్దిరోజుల కిందట ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబా కోరారు. ప్రచ్ఛన్న యుద్ధం మంచిదికాదు. ఇది అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు చేటు. మేము తీసుకునే ప్రతినిర్ణయం సైనికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఇతరత్రా భద్రత నిర్మాణంపై ప్రభావం చూపుతుంది అని కులేబా చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement