Tuesday, November 26, 2024

Telangana | నారాయణ, చైతన్య కాలేజీల‌ను కట్టడి చేయండి.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క (వీడియో)

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న కార్పోరేట్‌ కళాశాల కట్టడికి ప్రభుత్వం ఒక విధానం రూపొందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. బుధవారం శాసనసభలో సాధారణ బడ్జెట్‌ పై జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. నారాయణ , చైతన్య తదితర కార్పోరేట్‌ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు ఎంత వరకు ఉంటాయో తెలియదు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులను పీడించి ఫీజులు ఎడాపెడా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. వాటిని కట్టడి చేయకపోతే విద్యావ్యవస్థ మరింత భ్రష్టుపడుతుందని చెప్పారు.

కార్పోరేట్‌ కళాశాలలను గూర్చి భట్టి మాట్లాడుతున్నప్పుడు బీఆర్‌ఎస్‌ సభ్యుడు వివేకానంద అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, కార్పోరేట్‌ మేనేజిమెంట్లకు మద్దతుగా మాట్లాడుతున్నావా అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివేకానంద ఆ తర్వాత మౌనంగా కూర్చున్నారు.

పాదయాత్రలో ఇంటి స్థలం కోసం కన్నీటితో వేడుకున్నారు
తమ జిల్లాలో తాను గతంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇంటి స్థలం కోసమే చాలా మంది కన్నీటితో వినతులు సమర్పించారని భట్టి విక్రమార్క చెప్పారు. ముదిగొండ మండలం మందసిరి గ్రామంలో పాదయాత్రకు వెళ్లినప్పుడు ప్రియాంక అనే అమ్మాయి తన యాత్రకు అడ్డంగా వచ్చి, తమకు ఒకే గదిఉందని, ఆ గదిలోనే మూడు తరాల కుటుంబ సభ్యులము నివాసముంటున్నట్లు చెప్పారు. పేద వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం విషాల హృదయంతో వ్యవహరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement