Friday, November 22, 2024

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణం!

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. తీరథ్ సింగ్ రావత్ అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో బీజేపీ శాసనసభాపక్షం నిన్న సమావేశమై ఎమ్మెల్యే పుష్కర్ సింగ్ ధామీని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకుంది. ఈ క్రమంలో ఆదివారం ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య… పుష్కర్ సింగ్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, హరాక్ సింగ్ రావత్, బన్సీదార్ భగత్, యశ్ పాల్ ఆర్యా, బిషన్ సింగ్, సుబోధ్ ఉన్యాల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

కాగా, నాలుగు నెలల వ్యవధిలో ఉత్తరాఖండ్ కు మూడో సీఎం రావడం గమనార్హం. గత మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ తప్పుకోగా, తీరథ్ సింగ్ రావత్ సీఎం అయ్యారు. అయితే, ఆయన ఎంపీ కావడంతో, సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవడం అనివార్యమైంది. ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖతిమా నియోజవకర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పుష్కర్ సింగ్ ధామిని సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement