పుష్ప -2 ఫోక్ సాంగ్‌కు యూత్ ఫిదా
పల్లె పాటలతో పాపులర్ సింగర్‌గా ఎదిగిన లక్ష్మీ దాస
నా వాయిస్‌ను అల్లు అర్జున్ తెగమెచ్చుకున్నారు
అమ్మ పాడిన పాటలను అనుకరిస్తూ సింగర్‌గా ఎదిగాను
స్కూల్ టీచర్లంతా ఎంతగానో ప్రోత్సహించారు
పల్లెటూరి నుంచి పైస్థాయికి ఎదగడం నా అదృష్టం
ఆంధ్రప్రభ స్మార్ట్‌తో దాస లక్ష్మి అంతరంగం
ఆంధ్రప్రభ స్మార్ట్ అదిలాబాద్ బ్యూరో :
ప్రతిభ నైపుణ్యం ఉంటే అవకాశాలు దానంతట అవే తలుపు తట్టి దరిచేరుస్తాయి. పల్లె జానపదాలతో అందరినీ అలరించే నా పాటలు వెండితెరకెక్కి పాపులర్ అవుతాయని కలలో ఊహించలేదు. సినిమా ఇండస్ట్రీలో పుష్ప-2 మూవీ రికార్డు బద్దలు కొడుతుంటే.. ఈ మూవీలోని ఆరింటికోసారి.. నువ్వు పక్కనుంటే ..ప్రతి ఒక్క సారి వచ్చిందాయి. ఫీలింగ్.. అనే పాట చిన్నపిల్లాడి నుండి మాస్ యూత్ వరకు ప్రతి చోటా మారుమోగిపోతోంది. ఈ పాటకు ఇంత యమక్రేజ్ రావడం ఒక ఎత్తయితే.. డిఫరెంట్ వాయిస్ చాలా నచ్చింది.. అని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కితాబు ఇవ్వడం నాకు గొప్ప అనుభూతినిచ్చిందనీ సింగర్ దాస లక్ష్మి ఆంధ్రప్రభ కు వివరించింది.
గన్నోర పల్లెటూరు నుండి లక్ష్మీ ప్రస్థానం..
మహారాష్ట్ర సరిహద్దుల్లోని ముధోల్ మండలం గన్నోర మారుమూల పల్లెకు చెందిన దాస లక్ష్మణ్ జయశీల దంపతులకు రెండో కూతురు దాస లక్ష్మి. ఇంట్లో తల్లి జయశీల పాడే మరాఠీ కీర్తనలు, మరాఠి పాటలు అనుకరిస్తూ తెలుగులో ఫోక్ సాంగ్స్ పై దృష్టి సారించి స్టేజీల పైన, యూట్యూబ్ ఛానల్స్ లో పాడుతూ అనేక మేలుకోలు నేర్చుకున్నట్టు లక్ష్మి చెప్పింది. సాధారణ పేద కుటుంబానికి చెందిన తాను హై స్కూల్ , ఇంటర్ వరకు ముధోల్ మండలంలోనే చదువుకొని ఆ తర్వాత డిగ్రీ నిజామాబాద్ లో, పీజీ పొలిటికల్ సైన్స్ హైదరాబాదులో చదువుకున్నట్టు లక్ష్మీ దాస తెలిపింది.