Friday, November 22, 2024

Puri Temple – తెర‌చుకున్న పూరి ద్వారాలు…. తొలి హామీని నెర‌వేర్చిన బిజెపి

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్‌ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు.

దీంతో నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా పూరీ దేవాలయ నాలుగు ద్వారాలను తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 12 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకూ ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

- Advertisement -

కరోనా మహమ్మారి వ్యాప్తి ముందునాటి వరకూ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కోవిడ్-19 విజృంభణ సమయంలో కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. నాటి నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు.

ఈ నేపధ్యంలో భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందులకు గమనించిన బీజేపీ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ‍ర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన తొలి క్యాబినెట్‌ భేటీలో పూరీ ఆలయానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరీకి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement