ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ 46 ఏళ్ల తర్వాత ఇటీవల తెరవగా.. మరోసారి తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్న భండారాన్ని జూలై 18న తిరిగి తెరవాలని శ్రీ జగన్నాథ ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. రత్నాల భాండాగారంలోని ఆభరణాలను తాత్కాలికంగా మరో గదికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
జూలై 18 గురువారం ఉదయం 9.51 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య రత్న భండారం తాళాలను తీయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక గదికి తరలిస్తామని.. పురావస్తు శాఖ అధికారులు తమకు సహకరిస్తారని.. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీస్తామని జస్టిస్ బిశ్వంత్ రాథ్ తెలిపారు.
ఇక ఆ ఆభరణాలను తాత్కాలికంగా ఉంచే గదిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆ ప్రాంతం మొత్తం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్‌లు జరగకుండా అన్ని రకాల అగ్నిమాపక చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
తాత్కాలికంగా ఆభరణాలు ఉంచే గదికి పటిష్ట భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల అగ్నిమాపక చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జూలై 18న ఆలయ నిర్వాహకులు విధించే నిబంధనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ వర్గాలు తెలిపాయి.