Saturday, November 23, 2024

134 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి.. 48లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా యసాంగి ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది యాసంగిలో 6584 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 5134 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో ధాన్యం కొను గోళ్లు 100 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్ప టి వరకు రైతుల నుంచి 48లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. మొ త్తం 8,65, 679 రైతుల నుంచి రూ.9397కోట్ల ధాన్యాన్ని కొను గోలు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో మిగతా కేంద్రా ల్లొనూ కొను గోళ్లు పూర్తి కానున్నాయని పౌరసరఫరాల శాఖ తెలిపింది.

ధాన్యం బిల్లుల చెల్లింపుల్లో జాప్యం..

కొనుగోలు చేసిన ధాన్యం బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తూకం వేసి, మిల్లులకు తరలించిన తర్వాత వారం, పది రోజులు గడుస్తున్నా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం డబ్బుల కోసం రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం ముంచుకు రావడంతో ధాన్యం డబ్బులు వస్తే పెట్టుబడికి వినియోగిం చుకుంటామని రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడ్లు తూకం వేశాక కూడా 20 రోజలు వరకు డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. డబ్బుల కోసం అధికారులను అడిగితే బడ్జెట్‌ లేదని, రాగానే వేస్తామని చెబుతున్నారని రైతులు చెబుతున్నారు. త్వరగా ధాన్యం కొనుగోలు డబ్బలు చెల్లిస్తే వానాకాలం పంట పెట్టుబడికి వినియోగించుకుంటామని రైతులు ఎదురు చూస్తున్నాయి.
ధాన్యం కొనుగోళ్ల తొలినాళ్లలో కొను గోలు చేసిన తర్వాత 72 గంటల్లో రైతుల బ్యాం కు ఖాతాల్లో డబ్బులు జమఅయ్యాయి. కొను గోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాత ధాన్యం మిల్లులకు చేర్చాల్సి ఉంటుంది. మిల్లుకు చేరినట్టు ధృవీకరణ వచ్చిన తర్వాత ఆ వివరాలను కొనుగోలు కేంద్రాల సిబ్బంది పౌరసరఫరాల శాఖకు చేరవేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు మూడు రోజుల కు పైగా పడుతుండడం, ఆ తర్వాత నిదానంగా వివరాలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేస్తుండడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే సరికి వారం, పది రోజులు పడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement