Saturday, November 23, 2024

పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ రణదావా

పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ రణదావాను ఎంపిక చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే పంబాజ్ తదుపరి సీఎం ఎవరన్న సస్పెన్స్ కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ స్థానంలో సుఖ్‌జిందర్‌ను ఎన్నుకున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. అమరీందర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సుఖ్‌జిందర్‌కు ఉంది. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా సుఖ్‌జిందర్‌ రణదావాకు పేరు ఉంది. పంజాబ్‌ సీఎం రేసులో పలువురి పేర్లు వినిపించాయి. పీసీసీ చీఫ్‌ సిద్ధూతో పాటు మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్‌ జాఖడ్‌, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌, ప్రతాప్‌ సింగ్‌ భజ్వా, రణ్వీత్‌ బిట్టు, మంత్రి సుఖ్జీందర్‌ సింగ్‌ రంధావా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్‌ నేత అంబికా సోనీ పేరు తెరపైకొచ్చినా.. తాను సీఎం రేసులో లేనని ప్రకటించారామె.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement