Friday, November 22, 2024

పంజాబ్‌ బీజేపీ తొలి జాబితా.. 34 మందితో లిస్ట్ విడుద

పంజాబ్‌ అసెంబ్లి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ 34 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా విడుదల చేసిన జాబితాలో 13 మంది సిక్కులు, 9మంది దళితులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించామన్నారు. తొలి జాబితాలో ప్రకటించిన వారిలో 12 మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారని, 9 మంది ఎస్‌టీ అభ్యర్థులన్నారు.

అభ్యర్థుల్లో కొంత మంది ప్రొఫెషనల్స్‌ కూడా ఉన్నట్టు వివరించారు. డాక్టర్లు, న్యాయవాదులు, క్రీడాకారులు, రైతులు, యూత్‌, మహిళలతో పాటు మాజీ ఐఏఎస్‌లు కూడా అభ్యర్థులుగా ఉన్నారని వివరించారు. ఇటీవల బీజేపీలోకి చేరిన కాంగ్రెస్‌ మాజీ మంత్రి రాణా గుర్మిత్‌ సింగ్‌ సోది పేరు కూడా ఈ జాబితాలో ఉంది. జలంధర్‌ సెంట్రల్‌, జలందర్‌ నార్త్‌, ఫజిల్కా, హోషిర్‌పూర్‌లకు అభ్యర్థుల ఎంపిక జరిగింది. బీజేపీ చీఫ్‌ అశ్వనీ శర్మ.. పఠాన్‌కోట్‌ నుంచి పోటీ చేస్తారని భావించారు. ఆ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దినేష్‌ బాబుకు టికెట్‌ కేటాయించింది. ఇటీవల బీజేపీలోకి చేరిన ముగ్గురు కాంగ్రెస్‌ మాజీ నేతలకు సీట్ల కేటాయింపు పూర్తయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement