జిమ్ లో వర్క్ వుట్స్ చేస్తూ గుండెపోటుకి గురై హఠాత్త్ మరణం చెందారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఆయన మరణంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. హీరోగా పేరు తెచ్చుకోవడమే కాదు సామాజిక సేవలో కూడా ఆయన పేరు మారుమ్రోగుతోంది. పునీత్ రాజ్ కుమార్ అనాధాశ్రమాలు, స్కూల్స్, పిల్లలకు చదువులు లాంటి సేవాకార్యక్రమాలు తన సొంత ఖర్చులతో చేశారు. అలాగే అనేక అవేర్నెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. కాగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్.. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలియజేశారు. తెలంగాణ ఆర్టీసీ తరపున పునీత్ మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా సజ్జనార్.. పునీత్ చేసిన ఓ గొప్ప పనిని గుర్తు చేసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2019లో బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ ) కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని ఉపయోగించి సేఫ్ గా రవాణా సౌకర్యం పొందాలని సూచించారు. అలాగే బస్ ప్రయారిటీ గురించి ప్రజల్లో అవగాహన పెంచారు. బస్ ప్రయారిటీ లేన్ లో బీఎంటీసీ బస్సులు, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్లు లాంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీని ద్వారా ప్రజలకు రవాణా సౌక్యారం వేగంగా అందుతుందని తెలిపారు. కాగా పునీత్ చేసిన సేవలని సజ్జనార్ గుర్తు చేసుకుంటూ.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని ఎంకరేజ్ చేసినందుకు గాను పునీత్ ని అభించారు. పునీత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.