ఆస్ట్రోటాక్ కంపెనీ సీఈవో పునీత్ గుప్తా బంపర్ ఆఫర్ ప్రకటించాడు. టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 విజేతగా నిలిస్తే తమ వినియోగదారులకు రూ. 100 కోట్లు పంచుతానని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించాడు.
ఈసారి టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిస్తే నా ఆనందాన్ని పంచుకునేందుకు సిద్ధమయ్యా.అయితే, ఈసారి ఆస్ట్రోటాక్ వినియోగదారులతో తన ఆనందాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. భారత్ విజేతగా నిలిస్తే మా సంస్థ యూజర్లందరికీ రూ. 100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు పునీత్ గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టులో తెలిపారు.