గుమ్మడిదల లో టిఆర్ ఎస్ నిర్వహించనున్న రైతు ధర్నా కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.. వచ్చే యాసంగి కి సంబందించి రైతులు పండించే వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలుచేయాలని టిఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా నియోజవర్గ టిఆర్ ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని గుమ్మడిదల లో ఏర్పాటు చేసింది.. ధర్నా కోసం టిఆర్ ఎస్ నేతలు సర్వం సిద్ధం చేశారు.. భారీ ఎత్తున టిఆర్ ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉంది..కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలు హాజరుకానున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement