Sunday, November 24, 2024

రంజీలో సత్తా చాటిన పుజారా..

ఛటేశ్వర్‌ పుజారా.. పక్కా టెస్ట్‌ ప్లేయర్‌. అందుకే ఏ ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్‌ టోర్నీలో తీసుకోదు. ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు దూరం పెట్టారు. తాజాగా శ్రీలంకతో జరిగే సిరీస్‌కు కూడా బీసీసీఐ ఎంపిక చేయలేదు. టెస్టుల్లో కూడా చోటు కల్పించలేదు. పుజారాతో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ అజింక్యా రహానే, పేసర్‌ ఇషాంత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ వృద్ధిమాన్‌ సాహాలను పక్కనపెట్టింది. జట్టులో చోటు దక్కించుకోవాలంటే.. రంజీల్లో రాణించాల్సిందే అని సెలెక్టర్లు తేల్చి చెప్పారు.

దీంతో పుజారా తన సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా.. ముంబైపై భారీ స్కోర్‌ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఫాస్ట్‌గా ఆడేశాడు. అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్‌, 16 ఫోర్లు ఉన్నాయి. 109.64 స్ట్రయిక్‌ రేట్‌తో మెరిశాడు. తనలో ఇంకా సత్తా ఉందని చాటిచెప్పాడు. చివరికి ములానీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement