Thursday, November 21, 2024

మీ పబ్లిసిటీ తగలయ్య…లేని కూతురుని కూడా పుట్టించేశారుగా !!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. అది మంచి కోసం అయినా చెడు కోసం అయినా సోషల్ మీడియాను వాడేస్తున్నారు. దీని వల్ల బాధపడ్డ వారు ఉన్నారు. ఆనంద పడ్డ వారు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాననుకుంటున్నారా… పైన ఓ ఫోటో ఉంది చూడండి. ఆ ఫోటో ని చూస్తే మీకేమనిపిస్తుంది. ఓ మహిళా కానిస్టేబుల్ చిన్న పాపని ఎత్తుకుంది. ఈ ఫోటో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో తీసిన ఫోటో. ఇక ఈ ఫోటోని చూసి రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆ మహిళా కానిస్టేబుల్ ను అప్రిషియేట్ చేసి రివార్డును కూడా ప్రకటించాడు.

అందులో తప్పేముంది అని మీకు అనిపించొచ్చు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ ఫోటో బీబీనగర్ పోలింగ్ స్టేషన్ 369 జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ వద్ద తీసిన ఫోటో. ఆ పోలింగ్ సెంటర్ ఓ మహిళ చిన్న పాప ని పట్టుకుని ఓటు వేయడానికి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ కవిత ఆ పాపని అలా పట్టుకుని బయట నిలుచుంది. పాపని తీసుకు వచ్చిన మహిళ లోపలికి వెళ్లి ఓటు వేసింది. కానీ ప్రమోషన్ పిచ్చి లో పోలీసులు కానిస్టేబుల్ కవితకు లేని కూతురును పుట్టించారు. ఇక ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు సెటైర్లు వేస్తున్నారు. మీ పబ్లిసిటీ పిచ్చి తగలెయ్య అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement