బాన్సువాడ, మే 8 (ప్రభ న్యూస్) : ప్రజారోగ్య పరిరక్షణే నా ధ్యేయం అంటూ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం మరియు వయోవృద్ధుల ఫిజియోథెరఫీ కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాంతీయ ఆస్పత్రిలో జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రంతో పాటు వయోవృద్ధుల ఫిజియోథెరపీ ఏర్పాటు చేసుకోవడం మంచి శుభ పరిణామం అని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు కోరారు. ఎల్లప్పుడూ నా ప్రాంతం ప్రజలు బాగుంటేనే నాకు ఆనందమని, ఎప్పటికీ నా నియోజకవర్గ ప్రజలు సమస్య ఏదైనా నా దృష్టికి తీసుకొస్తే ఎలాంటి సమస్య అయినా తీర్చేందుకు కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నా ప్రాంత ప్రజలకి ప్రాంతీయ ఆసుపత్రి ఏర్పాటు చేసి అన్ని అంగులతో అధునాతన వైద్య పరికరాలు బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ యూనిట్, ఆక్సిజన్ యూనిట్, టిఫ స్కాన్ లాంటి పరికరాలను ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వంద పడకల సమర్థం గల 20 కోట్లతో మాత శిశు ఆసుపత్రి నిర్మించుకొని, ప్రతి మాసానికి 400 పైగా డెలివరీలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే తల్లిపాల ప్రోత్సవం అంశంలో బాన్సువాడ మాత శిశు ఆసుపత్రికి జాతీయ అవార్డు లభించడం ఎంతో శుభదాయమని ఆయన అన్నారు. ఈ అవార్డుతో బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి దేశంలోనే మంచి గుర్తింపు వచ్చిందని, ఏరియా ఆసుపత్రి నీ కలుపుతూ ప్రధాన రహదారి మీదుగా మూడు కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మించుకున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. నిరుపేద వర్గాల ప్రజలకి ఏ సమస్య కూడా ప్రజలకి భారం కాకుండా ఉండేందుకే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే ఉద్దేశంతో ప్రజాసేవయే సన్మార్గం వారి బాగోగులే చూడటమే నా లక్ష్యం అంటూ ఇన్ని పథకాలు అందించి వారి లో చిరునవ్వులు చూడటమే నా ధ్యేయమంటూ ఆయన అన్నారు. దీనికి తోడు సీఎం సహాయం నిధి కింద ఇతర ప్రాంతాలలో ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స నిమిత్తం అయినా రూపాయలను కూడా సీఎం సహాయనిధి కింద మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన పేర్కొన్నారు.
ఏరియా ఆసుపత్రికి మూత్రం భవనం నిర్మాణం కోసం ప్రతిపాదన పంపించామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో కన్నా ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవించేలా అన్ని హంగులతోని వైద్యులు చికిత్స చేస్తున్నారు. అంతగాను ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోని జరిగేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం రెడ్ క్రాస్ డే సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. యువకులు రక్త దానాలు చేశారు. రక్తదానం చేసిన వారికి సభాపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, బాన్సువాడ డి.ఎస్.పి జగన్నాథ్ రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రాంతీయ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.