Tuesday, November 19, 2024

Public Funishment – ఇళ్లు కూల్చిన ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే

ముంబై – మహిళా ఎమ్మెల్యే మాత్రం పేదల ఇళ్లను కూల్చివేసిన అధికారులపై చేయిచేసుకున్నారు. అది సరైన చర్య కాదని తెలుసునని.. అయినప్పటికీ తాను చేయాల్సి వచ్చిందని.. తాను న్యాయపరంగా కూడా దానిని ఎదుర్కొంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్ర లోని ఠానే జిల్లా మీరా భయందర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ . జూనియర్ సివిల్ ఇంజినీర్‌ కాలర్ పట్టుకుని చెంప వాయించారు. మీరా భయందర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొన్ని నిర్మాణాలను కూల్చివేయడంతో వర్షాకాలం ముందు చిన్నారులతో పాటు మరికొందరు రోడ్డున పడ్డారంటూ ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారంటూ అక్కడ ఉన్న ఇద్దరు ఇంజినీర్లను ఎమ్మెల్యే నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ సివిల్‌ ఇంజినీర్‌పై ఆమె చేయిచేసుకున్నారు ..

నిర్మాణాలు కూల్చివేయడంతో చాలా మంది రోడ్డున పడితే అధికారులు నవ్వుకోవడం చూసి తాను భరించలేకపోయానని ఎమ్మెల్యే అన్నారు. బాధితులు తమ కష్టాలను చెప్పుకుంటుంటే అధికారి నవ్వడం చూసి నేను నియంత్రణ కోల్పోయానని.. తమ ఇంటిని కూల్చివేయడం చూసి మహిళలు ఏడుస్తుంటే సంబంధిత అధికారి వారిని చూసి నవ్వుతున్నారని మండిపడ్డారు. తన చర్య అతనికి సహజమైన ప్రతిచర్య అని ఎమ్మెల్యే పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement