Sunday, December 1, 2024

TG | ప్రజాపాలన సంబురాలు.. రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలివే !

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్‌ 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజాపాలన ప్రభుత్వంలో సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలు పేరిట వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

రాష్ట్ర పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరిపేలా ఇప్పటికే జిల్లా స్థాయిలో మంత్రులు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కాగా, తొమ్మిది రోజుల విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రోజువారీ పనులను ఆయా మున్సిపల్‌ కమిషనర్లు షెడ్యూల్‌ విడుదల చేశారు.

రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలివే..

డిసెంబర్ 2 :
16 నర్సింగ్‌ మరియు 28 పారా మెడికల్‌ కళాశాలల ప్రారంభోత్సవం.
213 కొత్త అంబులెన్సులు ప్రారంభం.
33 ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ల ప్రారంభం.
ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లపై పైలట్‌ ప్రాజెక్టు.

డిసెంబర్ 3 :
హైదరాబాద్‌ రైజింగ్‌ కార్యక్రమాలు.
ఆరంగర్‌ నుండి జూ పార్క్ ఫ్లైఓవర్‌ ప్రారంభం.
రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్‌ పనుల ప్రారంభం
కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో 6 జంక్షన్ల అభివృద్ధి పనుల ప్రారంభం.

డిసెంబర్ 4 :
తెలంగాణ ఫారెస్ట్‌ డెవెలప్మెంట్‌ కార్పొరేషన్‌ భవన శంకుస్థాపన.
వర్చువల్‌ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం.
9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.

- Advertisement -

డిసెంబర్ 5 :
ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభం.
స్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు
3 (మేడ్చల్‌, మల్లేపల్లి, నల్గొండలో) అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం.
ఘట్‌కేసర్‌లో బాలికల ఐటీఐ కాలేజీ ప్రారంభం.

డిసెంబర్‌ 6 :
యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం.
244 విద్యుత్‌ ఉపకేంద్రాల శంకుస్థాపన.

డిసెంబర్‌ 7 :
స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ప్రారంభం
పోలీస్‌ బ్యాండ్‌ ప్రదర్శన.
తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

డిసెంబర్‌ 8 :
7 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టుల ప్రారంభం
130 కొత్త మీ-సేవల ప్రారంభం.
ఏఐ సిటీకి భూమిపూజ
స్పోర్ట్స్‌ యూనివర్శిటీకి శంకుస్థాపన.
తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు.

డిసెంబర్‌ 9 :
లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.
ట్యాంక్‌ బండ్‌ మీద ముగింపు వేడుకలు.
డ్రోన్‌ షో, ఫైర్‌ వర్క్‌, ఆర్ట్‌ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు.

Advertisement

తాజా వార్తలు

Advertisement