ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలిగా దిగ్గజ అథ్లెట్ పి.టి. ఉష(58) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అధ్యక్ష స్థానానికి డిసెంబరు 10న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, బరిలో ఎవరూ లేకపోవడంతో పి.టి. ఉష ఎన్నిక ఏకగ్రీవమైంది.
1934 తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి స్పోర్ట్స్‌పర్సన్ కూడా ఈమే కావడం గమనార్హం. ఇటీవల ఐఓఏ ఎంపిక చేసిన ఎనిమిది మంది అత్యున్నత అథ్లెటిక్స్ కమిటీలో పి.టి.ఉష కూడా ఉన్నారు. కాగా, అథ్లెట్‌గా ఉష ఎన్నో శిఖరాలను అధిరోహించారు.