న్యూఢిల్లి: రాజ్యసభలో అరుదైన సన్నివేశం చోటుచేసు కుంది. వెటరన్ అథ్లెట్ పీటీ ఉష గురువారం ఛైర్మన్ సీటులో కూర్చొని సభ కార్యకలాపాలను పర్యవేక్షించారు. రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ సభలో లేని సమయంలో వైస్ ఛైర్‌పర్సన్స్ కమిటీలోని సభ్యుటు ఎవరో ఒకరు సభా అధ్యక్ష బాధ్యతలు చూస్తారు. గత ఏడాది రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉష, ఛైర్‌పర్స్‌న్స్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. గొప్ప స్థానం ఇంకా గొప్ప బాధ్యతను కలిగి ఉం టుందనే ఫ్రాక్లిన్ రూజ్‌వెల్ట్ మాటల్ని ఉటంకిస్తూ ఉష ట్విట్ట ర్‌లో పోస్ట్ షేర్ చేశారు.
రాజ్యసభ సెషన్‌ను నిర్వహి స్తున్నప్పుడు నాకు గొప్ప భావన కలిగింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో ఈ ప్రయాణం మరింత పరిణితి సాధిస్తాను అంటూ ట్వీట్ చేశారు. పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన ఉష, ఆసియా క్రీడల్లో అనేక మార్లు స్వర్ణ పతకం సాధించారు. 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచారు. భారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఉష ట్విట్టర్ పోస్టులపై స్పందిస్తూ నెటిజన్లు అభినందనలు తెలిపారు.